News

బూట్లతో స్వామివారికి ఎమ్మెల్యే పట్టువస్త్రాలు

206views

శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ బూట్లు ధరించి స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరంగ రాజపురం మండలంలోని డీకే మర్రిపల్లి దళితవాడలో శ్రీవేంకటేశ్వరస్వామి భజన మందిరం నిర్మించారు. ఆలయంలో గురువారం కుంభాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ రైన డాక్టర్ థామస్ బూట్లు వేసుకునే పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన బూట్లు ధరించే పూర్ణకుంభానికి అక్షింతలు వేశారు. ఎమ్మెల్యే తీరుపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.