NewsProgramms

నంద్యాల, నెల్లూరులలో బాల వికాస కేంద్రాల ప్రథమ వార్షికోత్సవం

1.5kviews

మరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న బాల వికాస కేంద్రాల ప్రథమ వార్షికోత్సవాలు జరిగాయి. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం నందు గల మూలమట్టం కళ్యాణమండపం నందు, నెల్లూరులోని రంగనాయకుల పేటలో గల శ్రీ తల్పగిరి రంగనాయకుల స్వామి కళ్యాణ మండపం లోనూ జరిగాయి.  నంద్యాల కార్యక్రమంలో సిరివెళ్ల మండలంలోని గోవిందపల్లి, ఆళ్లగడ్డ మండలంలోని బతులూరు, రుద్రవరం మండలంలోని ఎల్లా వత్తుల, పాణ్యం మండలంలోని భూపనపాడు, మహానంది మండలంలోని పుట్టపల్లి, బేతంచెర్ల మండలంలోని సీతారామపురం, బనగానపల్లె మండలంలోని చెరువు పల్లె మరియు  కొలిమిగుండ్ల మండలంలోని మూడు బాలవికాస కేంద్రాల నుంచి విద్యార్థులు, శిక్షకులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న శ్రీ శ్రీ శ్రీ విరజానంద స్వామి

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా అచలానంద పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరజానంద స్వామి, సమరసతా సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దాసరి శ్రీనివాసులు, రాయలసీమ ధర్మ ప్రచారక్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత శ్రీ రామకృష్ణా రెడ్డి, డాక్టర్ ఉదయ్ శంకర్, నంద్యాల డివిజన్ ధర్మ ప్రచారక్ శ్రీ  శ్రీనివాసులు, కర్నూల్ డివిజన్ ధర్మ ప్రచారక్ శ్రీ నాగేంద్ర, నంద్యాల కన్వీనర్ శ్రీ మాధవ రెడ్డి, సహ కన్వీనర్ శ్రీ నాగ మోహన్ రెడ్డి మరియు నంద్యాల డివిజన్ మహిళా సహ కన్వీనర్ శ్రీమతి  అపర్ణ దీపిక గార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ప్రదర్శన చేస్తున్న బాల బాలికలు

ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ విరజానంద స్వామి మాట్లాడుతూ బాలవికాస్ కేంద్రాలు బాల బాలికలలో సంస్కార వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కుటుంబంలో తల్లిదండ్రులు, బిడ్డలు సమాజంలో అనేక వర్గాల వారు ఎలా ఉండాలో ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజ అభ్యున్నతికి బాల వికాస కేంద్రాల విద్యార్థినీ విద్యార్థులు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయని, ఇలాంటి బాల వికాస కేంద్రాలు మరెన్నో ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం ఆటల పోటీల్లో, ప్రదర్శన కార్యక్రమాలలో గెలుపొందిన బాల వికాస కేంద్రాల విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.

వేషధారణ

ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ధర్మ ప్రచారకులు మరియు మండల కన్వీనర్లు సహ కన్వీనర్లు మహిళా కన్వీనర్లు సహ కన్వీనర్లు మరియు విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా నంద్యాల టౌన్ నుండి అనేక మంది పెద్దలు పాల్గొన్నారు. నిర్వాహకులు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

కార్యకర్తలను సన్మానిస్తున్న దృశ్యం

బాల వికాస కేంద్రాల నిర్వాహకులు

నెల్లూరులో…

వేదికపై పెద్దలు

నెల్లూరు జిల్లాలో కొండాపురం మండలం బోయిళ్ళ వారి పాళెం, బోగోలు మండలం నాగులవరం, బుచ్చిరెడ్డిపాళెం మండలం పల్లాప్రోలు, అల్లూరు మండలం నార్త్ మోపూరు, అల్లూరు మండలం తూర్పు గోగులపల్లి, ఇందుకూరుపేట మండలం రావూరు, చేజెర్ల మండలం వావిలేరు, కలువాయి మండలం కనుపూరుపల్లి, రాపూరు మండలం మలమ్మగుంటలలో బాల వికాస కేంద్రాలు నడుస్తున్నాయి. ఆయా కేంద్రాల నుంచి బాల బాలికలు, కేంద్రాల నిర్వాహకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. SSF రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ కోట సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నెల్లూరు మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ ముక్కాల ద్వారకానాథ్ మరియు హైదరాబాదుకి చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీ ఎం. వి. జె. కె కుమార్ లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.  శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత, ఆర్. ఎస్. ఎస్. ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు.

ప్రసంగిస్తున్న శ్రీ బయ్యా వాసు

శ్రీ బయ్యా వాసు మాట్లాడుతూ బాల వికాస కేంద్రాల ద్వారా పిల్లలకు విద్యతోపాటు ఉత్తమ సంస్కారాలను అందించటం జరుగుతోందన్నారు. బాల వికాస కేంద్రాల కారణంగా పిల్లలలోనే కాక పెద్దలలో కూడా మార్పు సాధ్యమవుతోందన్నారు. బాల వికాస కేంద్రాలకు రావడం వల్ల పిల్లలకు చక్కగా చాడువురావడం తోపాటు, ఇక్కడ నేర్పించే వ్యాయామం, ఆట పాటల కారణంగా శారీరిక, బుద్ధి వికాసం కలుగుతుందని, ఇక్కడ చెప్పే చిన్న చిన్న కథల వల్ల పిల్లలకు దేశభక్తి అలవడడం తోపాటు, వ్యక్తిత్వ వికాసం కూడా కలుగుతుందని తెలిపారు.

అనంతరం పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలతో కార్యక్రమం కోలాహలంగా నడచింది. చివరిగా హైదరాబాదుకి చెందిన ప్రముఖ న్యాయవాది శ్రీ ఎం. వి. జె.కె కుమార్ తన స్వంత నిధులతో బాల బాలికలకు స్కూలు బ్యాగులను పంపిణీ చేశారు. SSF నెల్లూరు జిల్లా కన్వీనర్ శ్రీ నాగారెడ్డి హరికుమార్ రెడ్డి, జిల్లా సహ కన్వీనర్ శ్రీ కొమ్మిశెట్టి కార్తీక్, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ధర్మ ప్రచారక్ శ్రీ వెంగళ రెడ్డి, నెల్లూరు జిల్లా మహిళా కన్వీనర్ శ్రీమతి కొండేపి గిరిజమ్మ, బాల వికాస్ ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్ శ్రీమతి అద్దంకి విజయలక్ష్మి తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.