News

CAAపై అభిప్రాయాలు కోరిన కేంద్ర హోం శాఖ

903views

ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ చట్టం వివాదాస్పదంగా మారడంతో దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీఏఏపై తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయించింది. ఎంపీలు, పలువురు ప్రముఖులు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది. అభిప్రాయాల సేకరణకు ప్రత్యేకంగా ఓ ఈ మెయిల్‌ను రూపొందించింది. సీఏఏను ఎలా అర్థం చేసుకుంటున్నారు? పౌరసత్వ చట్టంపై మీ అభిప్రాయం ఏమిటి? భారతీయ పౌరులపై ఇది ప్రభావం చూపుతుందని భావిస్తున్నారా? ఈ బిల్లుతో పొరుగు దేశాల్లోని మైనార్టీ ప్రజలకు న్యాయం జరుగుతుందని అంగీకరిస్తున్నారా? దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, పలుచోట్ల హింసాత్మక ఘటనలపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ చట్టం దేశానికి నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారా? తదితర ప్రశ్నలను సంధించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ప్రజలు తమ అభిప్రాయాలను ఈ- మెయిల్‌ ద్వారా పంపాలని కోరింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.