News

కర్ణాటక ముఖ్యమంత్రి కాన్వాయ్ పై సిపిఎం గూండాల దాడి – చోద్యం చూసిన పోలీసులు

1.2kviews

కేరళలోని కన్నూర్‌లో సిపిఎం-డివైఎఫ్‌ఐ గూండాల బృందం ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప కాన్వాయ్‌పై దాడి చేసింది. దేవాలయాల సందర్శన కోసం యడియూరప్ప సోమవారం కేరళకు వచ్చారు. ఆయన నిన్న గురువాయూర్ ఆలయాన్ని సందర్శించుకున్నారు.

కన్నూర్ లోని మదాయిక్కావు తిరువర్కట్ భాగవతి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి వాహనంపై కేరళ రాష్ట్ర పోలీసుల సహకారంతో డివైఎఫ్ఐ గూండాలు దాడి చేశారు.అందిన సమాచారం మేరకు డ్రైవర్ సకాలంలో స్పందించడంతో కర్ణాటక ముఖ్యమంత్రికి ప్రాణాపాయం తప్పింది.

ముఖ్యమంత్రికి భద్రతాపరమైన బెదిరింపులు ఉన్నప్పటికీ, కేరళ పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు. సిఎం కాన్వాయ్‌కు తగిన భద్రత కల్పించలేదు. ఈ ప్రాంతంలో నియమించబడిన పోలీసు అధికారులు స్థానిక సిపిఎం నాయకుల సన్నిహితులే కావదంతో వారి సమ్మతితోనే దాడి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ సంఘటన తరువాత, కర్ణాటకలోని సిపిఎం కార్మికులు తీవ్ర అప్రమత్తమయ్యారు. కన్నూర్‌లో సిపిఎం కార్యకర్తలు చేసిన పనితో కేరళ ముఖ్యమంత్రి విజయన్ కుమార్తె టి వీణ బెంగళూరులో నడుపుతున్నఐటి సంస్థ ఎక్సోలాజిక్ సొల్యూషన్స్ వ్యాపార లావాదేవీలకు ముప్పు వస్తుందేమోనని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Source : Organiser

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.