
ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి పెద్దలు గౌరవాధ్యక్షులు శ్రీ గోకరాజు గంగరాజు గారు అధ్యక్షులు శ్రీ చలసాని ఆంజనేయులు గారు, ఉపాధ్యక్షులు శ్రీ బీవీ రమణ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ పాకాల త్రినాథ్ గారు, కార్యదర్శి దుర్గాప్రసాద్ రాజుగారు బృందంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP శ్రీ హరీశ్ కుమార్ గుప్త గారిని కలిసి ఈనెల 27 ఆగస్టు నుండి జరిగే గణేష్ ఉత్సవాలకి మండపాలవారు పెట్టుకున్న అర్జీ ఆధారంగా ఎలాంటి రుసుములు తీసుకోకుండా అన్ని రకాల అనుమతులు సింగిల్ విండో ద్వారా ఇవ్వాలని సమితి పెద్దలు కోరారు.
ఇందుకు డిజిపి గారు స్పందిస్తూ గణేష్ మండపాలకి ఇబ్బంది కలగకుండా సింగిల్ విండో పద్దతిలో యాప్ తయారు చేసి దానిలో నమోదు ద్వారా అనుమతులు ఎలాంటి రుసుములు తీసుకోకుండా ఇస్తామని ప్రభుత్వము మరియు గణేష్ ఉత్సవ సమితి సమన్వయంతో నవరాత్రులని విజయవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సింగిల్ విండో పద్ధతిలో యాప్ ద్వారా ఎలాంటి రుసుములు తీసుకోకుండా అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారికి, డీజీపీ గారికి ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేసింది.





