
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆ సేతు హిమాచలం 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణపతాకాన్ని ఎగరవేశారు. జాతి నుంచి ఉద్దేశించి ప్రసంగించారు. డిల్లీ నుంచి గల్లీ వరకూ త్రివర్ణ పతాక రెపరెపలాయి. మరోవైపు దేశ భక్తిని తమకు తోచిన రీతిలో ప్రదర్శించారు కొందరు. స్వాతంత్య దినోత్సవాన్ని పురష్కరించుకుని క పిఠాపురంలోని కృష్ణయ్య ఆలయాన్ని త్రివర్ణ రంగులతో అలంకరించారు,
దేశ వ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభంగా జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వకార్యాలయాలు, పాఠశాలలు, ప్రధాన కూడళ్లలు ఇలా ప్రధాన ప్రాంతాల్లో మువ్వన్నెల జెండాని ఎగురవేశారు. జాతీయ జెండా అంబరాన్ని తాకుతూ రెపరెపలాడింది. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సమరయోధులను స్మరిస్తూ.. ఘన నివాళులర్పించారు. ఈ స్వాతంత్య దినోత్సవ వేడుకలను దేవాలయాల్లో సైతం నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయాలను త్రివర్ణ పతాకాలతో అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పిఠాపురంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారిని జాతీయ జెండాలతో అర్చకులు అలంకరించారు. అర్చకులు విజయ జనార్ధనాచార్యులు ఆలయాన్ని జాతీయజెండాలతో అలంకరించారు. గర్భగుడిలో సైతం త్రివర్ణపతాకంతో అలంకరించడంతో జాతీయజెండా మరింత శోభాయమానంగా ప్రకాశిస్తోంది.





