
నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ప్రాంగణంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సమితి అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశమైన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రవీందర్ భారత మాత, దేశ నాయకుల చిత్ర పటాలకు, మాలార్పణ, పూజ తరువాత, జాతీయ పతాకాన్ని ఎగురవేశారు,

ఈ సందర్బంగా ప్రధాన వక్త ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ కామనూరు మనోహర్ గారు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా సంబరాలు జరుపుకోవటంతో పాటు మనం చేయవలసింది మరొకటుంది. మనం స్వాతంత్ర్యం కోల్పోవడానికి కారణాలను విశ్లేషించుకుని, ఆ పొరపాట్లు మల్లీ చేయకుండా, ఎందరో తమ సర్వస్వాన్ని త్యాగం చేసి సాధించిన స్వాతంత్ర్యాన్ని పదిలం పరుచుకుంటూ, వారి త్యాగాలే స్ఫూర్తి గా భారతమాత విశ్వ గురువుగా, పునర్వైభవ స్థితికి చేరుకునేందకు మన వంతు కృషి చేయాల్సిన బాధ్యత అందరిదని తెలిపారు.

సదరు కార్యక్రమంలో సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ కే మహేష్ రెడ్డి, కార్యదర్శి శ్రీ కర్నాటి నాగ సుబ్బారెడ్డి, కోశాధికారి శ్రీ సముద్రాల నాగ రాజయ్య, కార్యవర్గ సభ్యులు శ్రీ సింహ మల్లికార్జున, శ్రీ ఉసిరికాయల వెంకట రమణయ్య గౌడ్, ఆవాస ప్రముఖ్ శ్రీ గంగాధర్, సంఘమిత్ర చిన్నారులు పాల్గొన్నారు.





