
197views
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, సిరుల తల్లి పైడిమాంబ సిరిమానోత్సవానికి ముహూర్తం ఖరారు అయ్యింది. తొలేళ్లు, సిరిమాను ఊరేగింపు తేదీలను దేవస్థానం ఈవో కె.శీరిష, ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావుతో పాటు దేవస్థానం అధికారులు, అర్చకులు ఈవో కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. పైడిమాంబ మండల దీక్షలు సెప్టెంబరు 12 నుంచి ప్రారంభమౌ తాయన్నారు. పండగ షెడ్యూల్‌ను తెలియజేసే కరపత్రాన్ని కూడా ఆవిష్కరించారు. సెప్టెంబరు 12న పందిరి రాట ఉంటుందని, ఆ రోజుతో ప్రారంభమయ్యే సిరిమానోత్సవాలు అక్టోబరు 22న జరిగే చండీహోమంతో పూర్తవుతాయన్నారు. అక్టోబరు 14న పెద్దచెరువులో తెప్పోత్సవం, 19న కలశజ్యోతి ర్యాలీ, చివరిగా 22న ఉయ్యాల కంబాల ఉంటుందన్నారు. విలేకరుల సమావేశంలో ఆలయ సూపరింటెండెంట్ ఏడుకొండలు, మరో అధికారి రమణి, పూజారి బంటుపల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.





