NewsSeva

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

402views

సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరంలో 26-7-2025 తేదిన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా క్యాన్సర్ వ్యాధి నిర్థారణ పరీక్షలు, కంటి, రక్త , B.P పరీక్షలు చేశారు. శ్రీ బాలాజీ సేవా సంస్థ, సీనియర్ సిటిజన్ వారు మందులు అవసరమైన 196 మందికి ఉచితంగా ఔషదాలు వితరణ చేశారు.

ఈ కార్యక్రమంలో SSF ప్రాంత కార్యాలయ ఇన్చార్జి శ్రీ ఆగమచారి గారు, బాలాజీ సేవా సంస్థ శ్రీ సుంకర సుభాష్ చంద్రబోస్ గారు, జిల్లా ధర్మ ప్రచారక్ జైశంకర్ పాల్గొన్నారు. మండల సహ కన్వీనర్ శ్రీ వేంకటేశ్వర రెడ్డి గారు శిబిర నిర్వహణ ఏర్పాట్లు చేశారు.దేవాలయ కమిటీ సభ్యులు SSF అర్చకులు రఘువరన్ G. కొండూరు మండల సహ కన్వీనర్ శ్రీ ఆదినారాయణ గారు తదితరులు పాల్గొన్నారు.