News

భారత సైన్యంలో కొత్త శక్తి.. ‘రుద్ర’

212views

శత్రుమూకల ఆట కట్టించేలా భారత సైన్యంలో ఓ శక్తిమంతమైన దళం ఏర్పాటైంది. భవిష్యత్తు ముప్పును ఎదుర్కొనేలా ‘ఆల్‌ఆర్మ్స్‌ బ్రిగేడ్‌’ను ఏర్పాటుచేసినట్లు సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. దీనికి ‘రుద్ర’ అని పేరు పెట్టినట్లు తెలిపారు.

భారత సైన్యం ప్రస్తుత సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండేలా ఈ యూనిట్‌ను ఏర్పాటుచేసినట్లు జనరల్‌ ద్వివేది వెల్లడించారు. పదాతిదళం, యాంత్రిక పదాతిదళం, సాయుధ యూనిట్లు ఫిరంగిదళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు వంటి వ్యవస్థలతో కూడిన దళం ఇది అని వెల్లడించారు. సరిహద్దులోని శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేందుకు ‘‘భైరవ్‌’’ అనే లైట్‌ కమాండో బెటాలియన్‌ యూనిట్లను కూడా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే రెండు పదాతిదళ బ్రిగేడ్‌లు రుద్రలో భాగమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఈసందర్భంగా ఆపరేషన్‌ సిందూర్‌ గురించి కూడా ఆయన మాట్లాడారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలచివేసిందన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టి ఉగ్రవాదాన్ని సహించేది లేదనే గట్టి సందేశాన్ని పాకిస్థాన్‌కు ఇచ్చామన్నారు. దేశ ప్రజల విశ్వాసం, ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ కారణంగా ఇది సాధ్యమైందన్నారు. మన ఐక్యత, సార్వభౌమత్వాన్ని సవాలు చేయడంతో పాటు ప్రజలకు హాని చేయాలని చూసేవారికి ఇది సరైన సమాధానం చెప్పిందన్నారు. పాక్‌లోని ఉగ్రమూకల సదుపాయాలను నేలమట్టం చేయడంతో పాటు ఆ దేశ దుందుడుకు చర్యలను కూడా అరికట్టామన్నారు. భారత్‌ నిర్ణయాత్మకమైన విజయం సాధించిందని