
భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ( ఇస్రో) నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)నుండి పీఎస్‌ఎల్‌వీ-సీ48 రాకెట్ ప్రయోగం ఈ రోజు (11/12/2019 బుధవారం) మధ్యాహ్నం 3గంటల 25నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. సోమవారం జరగవలసిన ఎంఆర్‌ఆర్ సమావేశం కొన్ని అనివార్య కారణాల వల్ల మంగళవారం నిర్వహించారు. సమావేశం అనంతరం రాకెట్ కౌంట్‌డౌన్ నిర్ణయించిన సమయం సాయంత్రం 4గంటల 40నిమిషాలుగా నిర్ధారించి కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. నిర్విరామంగా 22గంటల 45నిమిషాలపాటు కౌంట్‌డౌన్ అనంతరం బుధవారం మధ్యాహ్నం 3గంటల 25నిమిషాలకు నింగిలోకి రాకెట్ ప్రయోగం జరుగుతుందని షార్ వర్గాలు తెలిపాయి. ఈ రాకెట్ ద్వారా భారత భూపరిశీలన ఉపగ్రహం ఆర్‌ఐశాట్-2బి ఆర్ 1 తోపాటు మరో 9 విదేశీ ఉపగ్రహాలను ఈ రాకెట్ వివిధ కక్ష్యల్లో వదిలిపెట్టనుంది.పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్‌లో ఇది 50వ ప్రయోగం కావడం వలన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రాకెట్ ద్వారా జపాన్, ఇటలీ, ఇజ్రాయిల్‌కు చెందిన ఒక్కొక్క ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 6 ఉపగ్రహాలను రాకెట్ శీర్షభాగంలోని హీట్ షీల్డ్‌లో అమర్చారు. ఈ ఏడాది శ్రీహరికోట నుండి ప్రయోగించిన ప్రయోగాలలో పిఎస్‌ఎల్‌వి-సి48 రాకెట్ 6వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ సిరీస్ రాకెట్లతో వరుస విజయాలతో దూసుకపోతున్న షార్ శాస్తవ్రేత్తలు ఈ రాకెట్‌ను కూడా ప్రయోగించి వాణిజ్య లాభాలు ఆర్జించేందుకు ఇస్రో అన్ని విధాలా సిద్ధమైంది. వాణిజ్యపరంగా పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఇప్పటివరకు 310 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిన ఘనత ఇస్రో తన ఖాతాలో వేసుకుంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.