ArticlesNews

పౌరసత్వ సవరణ బిల్లు – నిజం తెలుసుకుందాం – మెళకువగా మెలగుదాం

1.4kviews

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారు కొన్ని వాస్తవాలు తెలుసుకోవాలి. దీన్ని వ్యతిరేకించేవారు కేవలం రాజకీయ కారణాలవల్లే వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కొందరు తెలిసీ తెలియక, మరి కొందరు తెలిసినా దురుద్దేశ్యాలతో వద్దంటున్నారు. అసలు నిజా నిజాలేమిటోతెలుసుకుందాం.

ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఒకప్పుడు భారత్ లో అంతర్భాగాలే. ఆఫ్ఘనిస్థాన్ శతబ్దాల క్రితమే దురాక్రమణ కారణంగా భారత భూభాగం నుంచి విడిపోయింది. ముస్లింలీగ్ ద్విజాతి సిద్దాంతం కారణంగా పాకిస్థాన్ ఏర్పడింది. పాకిస్థాన్లోని తూర్పు భాగం (ఈస్ట్ బెంగాల్) విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది. ఈ మూడు దేశాలు కూడా అధికారికంగా ఇస్లామిక్ దేశాలు.

1947లో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు అక్కడి హిందూ జనాభా 15%. ప్రస్తుతం 1.6% మాత్రమే. బంగ్లాదేశ్లో 1941లో హిందువులు 28%. దేశ విభజన తర్వాత జరిగిన 1951 జనాభా లెక్కల ప్రకారం 22.05%కు పడిపోయింది. 2011 జనాభ లెక్కల ప్రకారం ఐతే అక్కడ 9.5%కి పడిపోయారు హిందువులు. ఇప్పుడు మరింత తగ్గే ఉంటారు. ఆఫ్ఘనిస్థాన్లో 1970 నాటికి హిందువులు 7.7 లక్షల మంది ఉంటే తాలిబాన్ల మతోన్మాద ఆటవిక పాలన ముగిసిన తర్వాత 2017 జరిగిన లెక్కింపులో కేవలం 7 వేల మందే మిగిలిఉన్నట్లుగా తేలింది.

అలాగే భారత దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన 1947 నాటికి ముస్లింలు 9.8% ఉండేవారు. ప్రస్తుతం 14.2%కి చేరుకున్నారు. అదే హిందువుల విషయానికి వద్దాం. 1947లో మన దేశంలో హిందూ జనాభా 84.1% , ప్రస్తుతం 79.8%కి తగ్గిపోయింది. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. భారత్ సర్వమత స్వేచ్ఛ ఉన్న దేశం. హిందువులు పెద్ద సంఖ్యలో ఉన్నా మత రాజ్యంగా ప్రకటించుకోలేదు. కానీ మన పొరుగు దేశాలు మత ప్రాతిపదిక ఏర్పడ్డాయి. అక్కడి ప్రభుత్వాలు, మతోన్మాదుల ఆగడాల కారణంగా హిందువుల జనాభా పడిపోయింది. అంతో ఇంతో మిగిలిన వారు భారత్ ఆశ్రయం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు.

ప్రపంచంలో ముస్లింలు, క్రైస్తవుల కోసం అధికారికంగా అనేక దేశాలున్నాయి. కానీ హిందువుల కోసం అధికారికంగా ప్రత్యేక దేశాలు లేవు. మన దేశంలో హిందువులు అత్యధికంగా ఉన్నా, హిందూయిజం అధికారిక మతం కాదు. అయినా సర్వమత సమభావన కారణంగా పొరుతు దేశాల హిందువులు మన దేశం వైపు ఆశగా చూస్తున్నందున వారికి రక్షణ కల్పించడం, ప్రయోజనాలను కాపాడటం మన నైతిక బాధ్యత. అందుకే ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును తెస్తోంది.

పౌరసత్వ సవరణ బిల్లు కారణంగా దేశంలో మైనారిటీ భద్రతకు ముప్పు ఏర్పడిందని కొందరు గగ్గోలు పెడుతున్నారు. మన దేశంలో మైనారిటీల సంక్షేమానికి ఎలాంటి ఢోకా లేదు. రాజ్యాంగ పరమైన రక్షణ ఉంది. నిజానికి మన దేశంలో హిందువుల జనాభాయే తగ్గుతోంది. కావాలంటే లెక్కలు చూసుకోండి.

నిజానికి 1947లో మత ప్రాతిపదికన దేశ విభజనకు కారణమైన కాంగ్రెస్ పౌరసత్వ సవరణ బిల్లును ప్రజలలో మత పరమైన విభజనను సృష్టించే బిల్లుగా పేర్కొంటోంది. కాంగ్రెస్ కు గానీ, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న ఇతర రాజకీయ పార్టీలకుగానీ, మీడియాకుగానీ మత ఛాందసులుగా, క్రూరులుగా, నర హంతకులుగా ముద్ర పడిన రోహింగ్యాలను ఈ దేశంలోకి అనుమతించడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. వారివల్ల ఎందరు హిందువులు హతమైనా పట్టింపు లేదు. బంగ్లాదేశ్ నుంచి లక్షలాది మంది అక్రమంగా మన దేశంలోకి చొరబడినా, స్థానిక ముస్లిములతో కలిసి హిందువులపై ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడినా, తీవ్రవాద కార్యకలాపాలకు పూనుకున్నా ఫర్వాలేదు. బంగ్లాదేశ్ టెర్రరిస్టు సంస్థ జమాత్-ఉల్-ముజాహిదీన్ (JUM) ప్రస్తుతం భారత్లో తన కార్యకలాపాలను విస్తరిస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) తన వార్షిక నివేదికలో వెల్లడించిన విషయం పట్టదు. వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డుల తోపాటు ఓటు హక్కును కూడా సంపాదించి తాము సంఖ్యాపరంగా అధికంగా ఉన్నచోట ఎన్నికల్లో గెలుపోటములను శాసిస్తున్న విషయం తెలిసినా మిన్నకుంటారు.

పాకిస్థాన్ నుంచి ప్రతి ఏటా కొన్ని వందల, వేల సంఖ్యలో భారత్లోకి చొరబడి భారత భూభాగంలో కల్లోలం సృష్టించడానికి యత్నిస్తున్న వారి గురించి చింతే లేదు. నిజంగా ఈ దేశ పౌరులెవరు, అక్రమ చొరబాటుదారులెవరు తెలుసుకుని చొరబాటుదారులను ఏరిపారెయ్యడానికి ఉపయోగపడే ఎన్.ఆర్.సీని వ్యతిరేకిస్తారు. మమతా బెనర్జీ లాంటివారైతే మా రాష్ట్రంలో ఎన్నార్సీ అమలు కుదరదంటే కుదరదు అంటూ బరితెగించి కారు కూతలు కూస్తారు. కానీ అదే నోటితో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో మెజారిటీ ముస్లిముల చేతిలో అత్యాచారాలకు, అణచివేతకు గురౌతున్న అమాయక హిందువులకు ఆశ్రయమివ్వడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లును మాత్రం మూర్ఖంగా వ్యతిరేకిస్తారు. దానిపై తమ అనుకూల, అమ్ముడుపోయిన మీడియా అండతో దుష్ప్రచారం కొనసాగిస్తారు.

హిందువులారా ఇకనైనా కళ్ళు తెరవండి. ఇన్నాళ్ళూ ఈ కుహనా లౌకిక వాదుల, వాళ్ళ పెంపుడు కుక్కలైన కొన్ని మీడియా సంస్థల కల్లబొల్లి కబుర్లు నమ్మి మోసపోయింది చాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా భారత్లో ఆశ్రయం పొందబోయేది రోహింగ్యాల్లా మత మౌఢ్యులు కాదు. నరమాంస భక్షకులు అంతకన్నా కాదు. తీవ్రవాదులూ, హింసావాదులూ, మానవబాంబులూ కాదు. సహజంగా సాత్విక స్వభావం కలిగిన అమాయక హిందువులు. నిజమైన లౌకిక వాదం వారాచరించే మన సనాతన ధర్మంలో ఉంది. ‘సర్వేజనాః సుఖినో భవంతు.. లోకా సమస్తా సుఖిన:సంతు..’ అని ఘోషించారు మన పూర్వీకులు. వారి వారసులమైన మనం కూడా సహజంగానే శాంతి కాముకులం. హిందూత్వం ఎక్కడ పరిఢవిల్లితే అక్కడ శాంతి వెల్లివిరుస్తుంది. ఇందులో సందేహం లేదు.

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా “మెజారిటీ హిందువుల వ్యతిరేకులు” అని అర్థం చేసుకోవాలి. ఎవరైనా పిచ్చి కూతలు కూస్తే వారి దురుద్దేశ్యాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి కుహనాలౌకికవాదులు, మతోన్మాదుల భ్రమల్లో పడకుండా అసలు వాస్తవాలను గ్రహించి ఈ బిల్లును నిండు మనసుతో ఆహ్వానిద్దాం.

రచన : క్రాంతి దేవ్ మిత్ర, సీనియర్ జర్నలిస్టు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.