News

అక్రమ ‘నిర్మాణల’పై చర్యలు కొనసాగుతాయి!

NEW DELHI, INDIA APRIL 16: Chief Minister of Uttarakhand Pushkar Singh Dhami during the inauguration of three days Ayodhya Parv-2022' organized by Gandhi Smriti and Darshan Samiti on the occasion of Ayodhya Parv at Raj Ghat, on April 16, 2022 in New Delhi, India. Ayodhya Parv was started in 2019 with the aim of underlining the cultural and historical glory and religious importance of Ayodhya. (Photo by Sonu Mehta/Hindustan Times via Getty Images)
206views

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 6,500 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమణల నుండి విముక్తి చేశామని 500కి పైగా అక్రమ నిర్మాణాలను తొలగించామని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చర్య పూర్తిగా చట్టబద్ధమైన పద్ధతిలో చేపట్టామని, ఈ పని ఆగదు, బుల్డోజర్ నడుస్తూనే ఉంటుందని చెప్పారు. ఆయన ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా చేసిన ఇంటర్వ్యూలో, ఆయన తన పదవీకాలంలో చేసిన పలు అంశాలపై స్పందించారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘జనాభా’ నిర్మాణంలో ఎటువంటి అసహజ మార్పు అనుమతించదు. చొరబాటుదారులకు ప్రభుత్వ సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్తం చేశారు.

ముస్లింల చొరబాట్లు పెరుగుతున్నందుకు సంబంధించి, వారిని గుర్తించే పని జరుగుతోంది. అటువంటి వ్యక్తుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు మరియు ఇతర సర్టిఫికెట్లను జప్తు చేసి రద్దు చేస్తున్నామని తెలిపారు. ఈ చర్య కేవలం చొరబాట్లను ఆపడానికి మాత్రమే పరిమితం కాదని వారికి ఈ సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రాబోయే అర్ధ కుంభ్ కోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం, 38 లక్షలకు పైగా భక్తులు చార్ ధామ్ యాత్ర చేశారు. యాత్రకు వీలుగా ప్రాథమిక సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు.