News

అమెరికాలో గోవిందుని కీర్తనలకు గిన్నిస్ రికార్డు

345views

అమెరికాలోని డాలస్ లో వేయి మందికి పైగా గాయకులు శాస్త్రీయ సంగీతంలో వెంకటేశ్వర స్వామి కీర్తనల్ని పఠించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలోbడాలస్ లోని ఎలాన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. వేయి మందికి పైగా ఒకేసారి ఒకే శృతిలో కీర్తనల్ని ఆలపించారు. ఇప్పటి వరకు నాలుగు వేలకు పైగా భజన కీర్తనలు రచించి, పది వేలకు పైగా భక్తి ప్రచార కార్యక్రమాలను గణపతి సచ్చిదానంద స్వామీజీ నిర్వహించారు.అనంతరం స్వామీజి అందరికీ గురుపౌర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు