News

వామపక్షాల భారత వ్యతిరేకతకు మరొక నిదర్శనం

181views

వామపక్షాలకు భారత వ్యతిరేకత, మైనారిటీల హక్కుల రక్షణ పేరుతో హిందూ ద్వేషం నిరంతరం బయటపెడుతూనే ఉంటాయి. ఇటీవల శ్రీనగర్ లోని టాగోర్ హాలులో సీపీఎం ఒకరోజు గోష్ఠి నిర్వహిం చింది. హాలంతా లాల్ సలామ్ నినాదాలంతో మారు మోగడమే కాదు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని, పాకిస్తాన్తో చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కూడా సభ్యులు గొంతు చించుకున్నారు. ఈ సమావేశానికి ఒక విధంగా ప్రాధాన్యం ఏర్పడింది.

కాశ్మీర్ లోయలోని చాలా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించడం కంటే రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతున్న నేపథ్యంలో ఇది జరిగింది. ఊరంతా ఒక దారి అయితే ఎర్ర ఉలూపి కట్టెది మరొక దారి కదా! ఏ సమావేశం జరిపినా, ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజల పేరుతోనే చేస్తారీ ప్రబుద్ధులు. ఈ సమావేశం కూడా జమ్ముకశ్మీర్ ప్రజల చట్టబద్ధమైన హక్కులను పునరుద్ధరించాలి అన్న నినాదంతో జరిపారు.

ఈ సమావేశానికి సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శి ఎం. అలెగ్జాండర్ బేబీ (కేరళ) అధ్యక్షత వహించాడు. ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చే ముందు పెద్ద చర్చ జరిగిందని బేబీ తనదైన చరిత్రను గుర్తు చేశాడు. అయితే ఇది తాత్కాలిక ప్రాతిపదికన చేరిందన్న విషయం మరుగుపరిచాడు. -370 రద్దు చేసిన తరువాత కాశ్మీర్లో శాంతి పరిఢవిల్లిందని, అభివృద్ధి జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పడాన్ని బేబీ విమర్శించాడు. పాకిస్తాన్ కాల్పుల కారణంగా ఊరి ప్రాంతంలో జరిగిన ఆనష్టాన్ని బేబీ వెళ్లి చూసి వచ్చారు. నష్టపోయిన వారికి కేంద్రం రూ.1.3 లక్షలు ఇచ్చి చేతులు ఆదులుపుకోవడం సరికాదని విమర్శించాడు. పెహల్గామ్ దాడిలో మరణించిన పోనీవాలా అదిల్ షా కుటుంబాన్ని కూడా బేబీ పరామర్శించాడు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కశ్మీర్లు చిరకాలంగా పోరాడుతున్నారని కూడా వ్యాఖ్యానించాడు. జేకేకి విభజించినందుకు స్థానిక సీపీఎం ప్రముఖుడు తరగామి కేంద్రాన్ని దుయ్యబట్టాడు.