News

జీసస్సే కాపాడతాడట.. రాముడు, హనుమ ఫొటోలు వద్దట

339views

మైనర్లనే టార్గెట్ చేస్తూ.. మత మార్పిడి చేస్తున్న రాకెట్ ఒకటి మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. దేవాస్ జిల్లాలోని సోన్ కచ్ ప్రాంతంలో గిరిజన మైనర్లే లక్ష్యంగా క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి చేస్తున్నట్లు తేలింది. వెనుకబడిన గిరిజన పిల్లలకు కోచింగ్ ఇస్తామన్న ముసుగుతో క్రైస్తవ బోధనలను చేయడం ప్రారంభించింది. అనేక ప్రలోభాలతో గిరిజనుల్ని ఆకర్షించాయి. అంతేకాకుండా హిందూ దేవతలను అవహేళన చేస్తూ కూడా కామెంట్స్ చేస్తున్నట్లు తేలింది.

‘‘జీసస్ కాపాడుతాడు. రాముడు గానీ హనుమంతుడు గానీ కాపాడరు. యేసు అన్నీ చేస్తాడు. ఏది అడిగినా ఇస్తాడు. కోరికలు నెరవేరుస్తాడు. ఆయన ఫొటో మీ ఇంట్లో వుంచుకోండి. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. మీ దేవుళ్లు రక్షించరు. రాముడు తన భార్య సీతను కాపాడలేదు. మిమ్మల్ని ఎలా కాపాడుతాడు? వాళ్లే దేవుళ్లు అయితే.. ప్రపంచంలో ప్రతి రోజూ ఇన్ని చెడు విషయాలు ఎందుకు జరుగుతాయి? అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. ‘‘ఆ రోజు ఉదయం మతపరమైన సమావేశం జరగనుందని ఓ గ్రామస్తుడు నాకు సమాచారం ఇచ్చారు. పాస్టర్ తో పాటు కొందరు గ్రామస్తులు ఉదయం 9 గంటలకు వేదికకు చేరుకున్నారు. భగ్ను జియాజీ ఇంట్లో సమావేశం జరుగుతోంది, మరియు అప్పటికే గ్రామంలోని అనేక మంది మహిళలు మరియు పిల్లలు హాజరయ్యారు.మంజు, కిరణ్, మహిద అనే ముగ్గురు మహిళలు, సచిన్, మిథున్ అనే ఇద్దరు పురుషులు సహా ఐదుగురు బయటి వ్యక్తులు ఈ సెషన్ నిర్వహిస్తున్నారని తేలింది.వారందరూ యేసుక్రీస్తు పోస్టర్లను తెచ్చి గోడలపై అతికించారు. ఆ బృందం క్రైస్తవ ప్రసంగాలు చెప్పడం మరియు మతపరమైన సందేశాలను ఇచ్చారు.’’ అని స్థానికుడు తెలిపాడు.

అంతేకాకుండా కుటుంబీకులను, పిల్లలను కూడా మత మారమని ప్రోత్సహించేవారని అన్నారు. మతం మారిన వారికి 50 వేల నగదు, ఉచిత విద్య, మంచి పాఠశాలలో అడ్మిషన్ కూడా ఇప్పిస్తామంటూ ప్రలోభాలు పెట్టారని తెలిపారు. హిందూ మతాన్ని విడిచిపెట్టి, తమ మతంలో చేరాలని, ఆశీర్వదించబడతారని పదే పదే చెబుతున్నారని హిందువులు పేర్కొన్నారు.

అయితే.. దీనిపై స్థానిక హిందువులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైస్తవ మిషనరీలు హిందూ విశ్వాసాలను కించపరిచారని, హనుమంతుడు, శివుడు, శ్రీరాముని ఫొటో