News

పాక్‌కు సమాచారం చేరవేత.. పంజాబ్‌లో ఇద్దరు గూఢచారులు అరెస్ట్‌

171views

పాకిస్తాన్‌కు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న అభియోగాలపై ఇద్దరు గూఢచారులను పంజాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాక్‌కు కీలక సమాచారం చేరవేసిసట్లు గుర్తించిన పంజాబ్‌ పోలీసులు.. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించి గుర్‌ప్రీత్‌ సింగ్‌ సాహిల్‌ మాసిహ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరికి ఐఎస్‌ఐ ఏజెంట్‌ జావెద్‌తో సంబంధాలున్నట్లు గుర్తించారు. ప్రధానంగా జావెద్‌తో గుర్‌ప్రీత్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారలో వెల్లడైంది. పంజాబ్‌లోని ధరివాల్‌కు చెందిన గుర్‌ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం ఇండియన్‌ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. సాహిల్‌కు అదే ప్రాంతానికి చెందినవాడు కావడంతో పాటు ఇండియన్‌ ఆర్మీలోనే ఉన్నాడు. వీరిద్దరూ కలిసి నేరుగా పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లతో సంబంధాలు ఏర్పరుచుకుని కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనేది ప్రధాన అభియోగం.