
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తులు( విశ్వసిస్తారు. ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం-TTD చుట్టుపక్కల పురాతన కట్టడాలు ఉండడం తెలిసిన విషయమే. అయితే తిరుమల పరిధిలోని పురాతన కట్టడాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఈ క్రమంలో శిథిలావస్థలో ఉన్న కట్టడాలను పరిరక్షించేందుకు టీటీడీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో అలిపిరిలో ఉన్న పురాతన పాదాల మండపం పరిరక్షణకు టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దాదాపు 500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ మండపం శిథిలావస్థకు చేరింది. రెండు రోజుల క్రితం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా -ASI అధికారులు, నిపుణులు పలువురు పురాతన పాదాల మండపాన్ని పరిశీలించారు.
ప్రత్యేకత ఏంటంటే..
అలిపిరిలో ఉన్న పురాతన పాదాల మండపం అనేది తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో ఉంది. ఈ మండపం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుచానూరులో తన భార్యను దర్శించుకుని, అలిపిరి మెట్ల మీదుగా దిగి వచ్చినప్పుడు తన పాదాలను తాత్కాలికంగా విడిచి పెట్టిన ప్రదేశం అని చెబుతారు. అందుకే దీనిని పాదాల మండపం అని పిలుస్తారు. స్వామి వారి పాదాలు తాత్కాలికంగా విడిచి పెట్టిన ప్రదేశంగా భావిస్తారు కాబట్టి.. ఈ మండపం పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం ఈ మండపం శిథిలావస్థకు చేరుకున్నందున.. పునర్నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నారు





