
281views
విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవాలయంలో గురువారం నుంచి వరుస ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు స్వామివారి దర్శన వేళలు, ఆర్జిత సేవల్లో మార్పులు చేసినట్లు ఈవో వేండ్ర త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలిలా.. ఈ నెల 9వ తేదీ వరకు నమ్మాళ్వార్ తిరు నక్షత్రం పూజలు జరగనున్న నేపథ్యంలో రాత్రి 7గంటల తర్వాత భక్తులకు దర్శనాలు లభించవు. రాత్రి ఆరాధన టికెట్లు కూడా రద్దు చేశారు.





