News

గోవధ నిరోధక చట్టం అమలుకు ప్రత్యేక బృందాలు

228views

ఈ నెల 7 వ తేదీన ముస్లింలు జరుపుకునే బక్రీద్ సందర్భంగా గోవధను అరికట్టటానికి గుంటూరు జిల్లా జంతు హింస నివారణ సంఘం సమావేశాన్ని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ్ తేజ ఆధ్వర్యంలో నిర్వహించారు. గోవధ నిరోధక చట్టం 1977 నిబంధనల ప్రకారం ఆవులను, పశువులను వధించరాదు. ఈ నిబంధనలకు లోబడి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయటానికి గుంటూరు జిల్లా పరిధిలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. పోలీసు శాఖవారు ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటుచేసి, జంతువుల అక్రమ రవాణా పై తనిఖీలు నిర్వహించనున్నారని చెప్పారు. అలాగే ప్రజలు ఎవరైనా ఈ అక్రమ రవాణాను గమనిస్తే వెంటనే 86888 31307 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించారు.