News

సిపిఎం పార్టీకి పట్టున్న గ్రామంలో పట్టుబడ్డ ఐసిస్ ఉగ్రవాదులకు శిక్షలు ఖరారు చేసిన NIA  కోర్టు.

956views

నకమల ఐసిస్ టెర్రర్ కేసులో ప్రధాన నిందితడికి కొచ్చిలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది, ఈ కేసులో పట్టుబడ్డ నిందితులు రాష్ట్ర బిజెపి నాయకులతో సహా ప్రముఖ వ్యక్తులను హత్య చేయడానికి, కేరళ మరియు పొరుగు రాష్ట్రాలలో ఉగ్రవాద దాడులు చేయడానికి కుట్ర పన్నినట్లుగా కోర్టు పేర్కొంది. ప్రధాన నిందితుడు మన్సీద్ మెహమూద్‌తో సహా 6 మందిని సోమవారం కోర్టు దోషులుగా గుర్తించింది. ఈ కేసులో రెండవ నిందితుడు స్వాలిహ్ మొహమ్మద్‌కు 10 సంవత్సరాలు, మూడవ నిందితుడు రషీద్ అలీకి ఏడు సంవత్సరాలు, నాల్గవ నిందితుడు ఎన్ కె రమ్‌షాద్, ఎనిమిదవ నిందితుడు మొయినుద్దీన్‌లకు మూడేళ్లు, ఐదవ నిందితుడు సఫ్వాన్‌కు ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్షను కోర్టు విధించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పి కృష్ణకుమార్ ఈ తీర్పును ప్రకటించారు.దోషులకు వేర్వేరు మొత్తాలలో జరిమానాలను కూడా కోర్టు విధించింది. ఈ కేసులో ఒక నిందితుడైన జాసిమ్ ఎన్ కెను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. అతను ఐసిస్‌లో చేరలేదని కోర్టు పేర్కొంది. కానీ అతను ఉగ్ర ముఠా సభ్యునిగా పిలవడానికి అర్హుడు అని కోర్టు స్పష్టం చేసింది.కనకమల IS టెర్రర్ కేసుకన్నూర్ జిల్లాలోని కనకమల నుండి ఐఎస్ కేసును ఎన్‌ఐఏ 2016 అక్టోబర్‌లో ఛేదించింది. కనకమల సిపిఎం పార్టీకి పట్టున్న గ్రామం. ఇక్కడ కమ్యూనిస్టులు కాకుండా ఇతర రాజకీయ పార్టీ కార్యకర్తలు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి అనుమతి లేదు. న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు మరియు విదేశీ పర్యాటకులతో సహా ప్రముఖులపై ఉగ్రవాద దాడులను ప్లాన్ చేయడానికి నిందితులు ఇక్కడ సమావేశం నిర్వహించారు.ఈ కేసుకు సంబంధించి ఆరుగురిని NIA పోలీసులు అరెస్టు చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యుఎపిఎ) లోని వివిధ సెక్షన్ల కింద ఉగ్రవాద సంస్థ సభ్యత్వానికి సంబంధించిన నేరాలు మరియు ఉగ్రవాద సంస్థకు ఇచ్చిన మద్దతుతో సహా అనేక అభియోగాలు వారిపై మోపారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.