News

నల్లమలలో తెలుగు శాసనం

277views

ప్రకాశం జిల్లాలోని పెద్ద దోర్నాల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో తెలుగు శాసనం లభ్యమైనట్లు ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సీనియర్‌ అసిస్టెంట్‌ టి.శ్రీనివాస ప్రసాద్‌ తెలిపారు. ఇది 14 – 15 శతాబ్దాలకు చెందినదని… శ్రీ పర్వత మల్లికార్జునుడి ఆలయ భూముల్లో బావి తవ్వకం, తూము నిర్మాణానికి సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరిచారని వివరించారు. శ్రీశైలంలోని వీర శైవ మఠం పీఠాధిపతి సిద్ధ భిక్షవృత్తి అయ్యంగారు, ఆయన ఆజ్ఞాతరులు కేమిదేవుడు తదితరుల ప్రస్తావన ఇందులో ఉన్నట్లు వెల్లడించారు.