News

నాగపూర్ కేంద్రంగా కార్యకర్త వికాసవర్గ- 2 ప్రారంభం

466views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త వికాస వర్గ -2 ఈ నెల 12 న ప్రారంభమైంది. నాగపూర్ లోని రేషంబాగ్ లోని హెడ్గేవార్ స్మృతి భవనంలో జరుగుతోంది. వర్గపాలక్, సహ కార్యవాహ అలోక్ కుమార్, సహ కార్యవాహ రామదత్త చక్రధర్ (వర్గ సర్వాధికారి), సమీర్ కుమార్ మహంతి భారత మాత చి్ర పటానికి పూలు సమర్పణ చేయడంతో ఈ వర్గ ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 840 మంది శిక్షార్థులు ఈ వర్గకు హాజరయ్యారు. జూన్ 5 న ఈ వర్గ ముగుస్తుంది. సామాజిక అవగాహన, సామాజిక మార్పు, సంఘ్ పై ఇందులో శిక్షణనిస్తారు.

ఈ కార్యకర్త వికాస వర్గ -2 ద్వారా జాతీయ భావాన మేల్కొంటుందని వర్గ పాలక్ అలోక్ కుమార్ అన్నారు. దేశంలో వుండే వైవిధ్యతను కూడా ఈ వర్గలోని శిక్షార్థులు తెలుసుకుంటారన్నారు. అలాగే భారత్ లో వైవిధ్యత వున్నా.. మూల భావన మాత్రం మారదని తేల్చి చెప్పారు. ఈ వర్గలో ఇచ్చే కఠోరమైన శిక్షణ ద్వారానే కార్యకర్తలు తయారవుతారని, నిర్ణీత కాలంలోనే వారిని వికసింపచేయడం ఈ వర్గ ఉద్దేశమని, అలాగే వీరి ద్వారా సంఘ కార్యాన్ని విస్తరిస్తామని తెలిపారు. అలాగే శిక్షావర్గల ద్వారా కార్యకర్త క్రమంగా వికాసం చెందుతారని, కార్య విస్తరణలో కూడా వేగం పెంచుతారన్నారు.

1927 లో నాగపూర్ కేంద్రంగా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని అలోక్ కుమార్ గుర్తు చేశారు. అప్పటి నుంచే దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం శిక్షణా తరగతులు జరుగుతున్నాయని, చాలా మంది స్వయంసేవకులు హాజరవుతున్నారని అలోక్ కుమార్ తెలిపారు.