
364views
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం-2025ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి తాత్కాలిక ఉపశమనం అంశాన్ని మాత్రమే ఈ నెల 20న పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ తెలిపారు. మూడు అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే విషయమై ఆ రోజు విచారణ జరుపుతామని జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం వెల్లడించింది. న్యాయస్థానాలు వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించిన వాటిని డీనోటిఫై చేసే అధికారం; కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ మండళ్ల కూర్పు; ప్రభుత్వ భూమిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొనడంపై తలెత్తిన వివాదంలో కలెక్టర్ విచారణ జరిపితే దానిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించకపోవడం….అనే మూడు అంశాలను ధర్మాసనం పరిశీలించనుంది. ఇరుపక్షాల న్యాయవాదులు ఈ నెల 19లోగా వారి వాదనలను లిఖితపూర్వకంగా అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది.





