News

పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు.. రోడ్డుపైనే తగిన శాస్తి చేసిన పోలీసులు

312views

ఆపరేషన్ సిందూర్ తో ఇస్లామిక్ ఉగ్రవాదులకు భారత సైన్యం తగిన బుద్ధి చెప్పింది. అయినా సరే భారత్ తిండి తింటున్న వారికి పాకిస్తాన్ మీద ప్రేమ తగ్గడం లేదు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ, ఆపరేషన్ సిందూర్ ను, భారత సైన్యాన్ని కించపరిచే పోస్టులు చేస్తున్నారు. ఇదే సీన్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. కొంత మంది భారత దేశ వ్యతిరేకులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారందర్నీ బహిరంగంగానే కొడుతూ శిక్షించారు. అంతేకాకుండా రోడ్డుపైనే శిక్షిస్తూ, నడిపించారు.

జితేంద్ర ప్రతాప్ సింగ్ అనే యూజర్ ఓ వీడియోను బయటపెట్టారు. అందులో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కొందరు పేర్కొంటూ, పోస్ట్ చేశారు. దీంతో ఇది వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు వారిని బహిరంగంగానే శిక్షించారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.