
341views
శ్రీరాముణ్ని పౌరాణిక, ఊహాజనిత పాత్రగా రాహుల్‌గాంధీ అభివర్ణించారని ఆరోపిస్తూ ఒక న్యాయవాది స్థానిక కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. కాంగ్రెస్ నేతపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదుదారు కోరారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు అయిన రాహుల్‌గాంధీ అమెరికాలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీని కూడా కక్షిదారుగా చేర్చారు. కోర్టు ఈ కేసుపై ఈనెల 19న విచారణ జరపనుంది. అమెరికాలో బోస్టన్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గతనెల 21న ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఫిర్యాదు దాఖలు చేసిన న్యాయవాది హరిశంకర్ పాండే పేర్కొన్నారు.





