News

రఫేల్‌పై రాహుల్ ఆరోపణలలో పస లేదు – సుప్రీం

540views

ఫేల్‌ అంశంలో కేంద్రానికి ఊరట లభించింది. రఫేల్‌పై దాఖలైన సమీక్ష పిటిషన్లంటినీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. 36 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2018 డిసెంబర్‌ 14న సంబంధిత పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును పునఃపరిశీలించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌శౌరీలతోపాటు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌లు వ్యాజ్యాలు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తాజాగా వీటిపై తీర్పు వెల్లడించింది. రఫేల్‌పై దాఖలైన సమీక్ష పిటిషన్లంటినీ సుప్రీం కోర్టు తిరస్కరించింది. రఫేల్‌పై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

రాహుల్‌ మాటలు జాగ్రత్త : సుప్రీం

కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని సుప్రీం కోర్టు హెచ్చరించింది. రఫేల్‌ వ్యవహారంపై స్పందిస్తూ..ప్రధాని మోదీని ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ రాహుల్‌ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత మీనాక్షి రాహుల్‌పై కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం రాహుల్‌ గాంధీని సున్నితంగా హెచ్చరించింది. ‘మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించింది. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం వ్యాఖ్యలకు రాహుల్‌ క్షమాపణలు చెప్పారు. ఆయన క్షమాపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం వాదనలను ముగించింది.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.