News

ఛార్ థామ్ యాత్ర ప్రారంభం

483views

ఉత్తరాఖండ్ పరిధిలోని హిమాలయాల్లో వెలసిన నాలుగు ఆలయాల (చార్ థామ్) సందర్శనకు తలుపులు తెరుచుకున్నాయి. బుధవారం అక్షయ తృతీయ పర్వదినం కావడంతో భక్తుల కోసం గంగోత్రి, యమునోత్రి ఆలయాల తలుపులు తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా రెండు ఆలయాలైన కేదార్నాథ్ మే 2 నుంచి, బద్రీనాథ్ మే 4 నుంచి భక్తుల సందర్శనకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ నాలుగు ఆలయాలను ఏటా శీతాకాలంలో ఆర్నెల్లపాటు మూసి ఉంచుతారు. చార్ థామ్ యాత్ర ప్రారంభం అవుతున్నందున ఉత్తరాఖండ్ డీజీపీ దీపం సేఠ్ రుషికేశకు చేరుకొని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పటిష్ఠమైన భద్రతకు చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. గతేడాది చార్ థామ్ యాత్రకు 48 లక్షల యాత్రికులు విచ్చేశారు.