News

యూపీకి 4వేల మంది కేంద్ర బలగాలు

861views

అయోధ్య తీర్పు వెలువడనున్న దృష్ట్యా యూపీకి 4 వేల మంది కేంద్ర బలగాలను పంపారు. వివాదాస్పదమైన రామజన్మ భూమి- బాబ్రీ మసీదు కేసులో ఈనెల 18వ తేదీలోగా తీర్పు వెలువడనున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వం విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే 12 జిల్లాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 15 పారా మిలటరీ కంపెనీల బలగాలను కేంద్రం పంపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.