News

జమ్మూ కాశ్మీర్, లడఖ్ అధికారిక మ్యాపుల విడుదల

158views

మ్మూకాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31 నుంచి జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు రెండూ కేంద్రపాలిత ప్రాంతాలుగా మనుగడలోకి వచ్చాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అధికారికంగా ఈ రెండు ప్రాంతాల, దేశ చిత్రపటాలను విడుదల చేసింది.
అక్టోబర్ 31 నుంచి.. కార్గిల్, లేహ్ జిల్లాలతో కూడిన లడఖ్ ప్రాంతం ఒక కేంద్రపాలిత ప్రాంతం కాగా, ఇక మిగితా జమ్మూకాశ్మీర్ అంతా కూడా రెండో కేంద్రపాలిత ప్రాంతం అయ్యింది. 1947 నుంచి ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్ గత బుధవారం అర్ధరాత్రి 12గంటలు దాటిన తర్వాత అంటే గురువారం(అక్టోబర్ 31) నుంచి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి.

పునర్విభజన..

1947 నాటి నుంచి జమ్మూకాశ్మీర్‌లో కథువా, జమ్మూ, ఉధంపూర్, రియాసి, అనంతనాగ్, బారాముల్లా, పూంఛ్, మిర్పూర్, ముజఫరాబాద్, లేహ్, లడఖ్, గిల్గిత్, గిల్గిత్ వజరాత్, చిల్హాస్, ట్రైబల్ టెరిటోరీ జిల్లాలుగా ఉన్నాయి. 2019లో జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని పునర్విభజన చేసిన ప్రభుత్వం 14 జిల్లాలను 28 జిల్లాలుగా మార్చింది.

కొత్త జిల్లాలు..

ఇక కొత్త జిల్లాల విషయానికొస్తే కుప్వారా, బందిపుర, గందర్బల్, శ్రీనగర్, బుద్గాం, పుల్వామా, షుపియాన్, కుల్గాం, రాజౌరి, రాంబన్, దొడ, కిష్టివర్, సాంబ, కార్గిల్ ఉన్నాయి. కార్గిల్ జిల్లా లేహ్, లడఖ్‌ల నుంచి ఏర్పడింది. జమ్మూకాశ్మీర్ పునర్విభజన ప్రకారం లేహ్ జిల్లా లడఖ్ ప్రాంతంలోనే ఉంది. గిల్గిత్, గిల్గిత్ వజరాత్, చిల్మాస్, ట్రైబల్ టెరిటోరి ప్రాంతాలు ఇందులోనే ఉన్నాయి.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.