
మన దేశంలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వచ్చిన జర్మనీ దేశస్థురాలిపై హైదరాబాద్ శివారులో అత్యాచారం జరిగింది. యాకుత్ పూరా కి చెందిన డ్రైవర్ మహ్మద్ అబ్దుల్ అస్లాం (25) ఈ దారుణానికి ఒడిగట్టాడు. జర్మనీ యువతి, యువకుడిని మహ్మద్ అబ్దుల్ పరిచయం చేసుకున్నాడు.ఈ సమయంలో అబ్దుల్ స్నేహితులు కూడా వున్నారు. తమతో వస్తే మార్కెట్ కి తీసుకెళ్తామని, కొత్త ప్రాంతాలు కూడా చూపిస్తానని నమ్మించాడు. వారిద్దరూ కారు ఎక్కడంతో పాతబస్తీలోని వేర్వేరు ప్రాంతాలలో తిప్పి, స్ట్రీట్ ఫుడ్ కూడా తినిపించాడు.
దీని తర్వాత ఎలాగైనా యువతి స్నేహితుడ్ని ఎలాగైనా దించేయాలని అనుకున్నాడు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే దారిలోని మామిడిపల్లి గ్రామ సమీపంలోకి కారు వెళ్లింది. వారి స్నేహితులను కారు దింపి, సెల్ఫీలు తీసుకోవాలని అబ్దుల్ అస్లాం సూచించాడు. అయితే.. ఈ సమయంలో జర్మనీ యువతి ఆ కారులోనే వుంది. యూటర్న్ తీసుకొస్తానని చెప్పి, దగ్గరలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే సెల్ఫీలు తీసుకుందామని అబ్దుల్ ఆ యువతిని నమ్మించి, కారు దింపాడు. ఆ యువతి కారు దిగగానే ఇక బెదిరించాడు. కారులోనే అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడు. దీని తర్వాత ఆమెను మళ్లీ కారులో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలోనే యువతి కారులోంచి దూకేసింది.
ఆ తర్వాత అబ్దుల్ తన స్నేహితులతో కలిసి, పరారయ్యాడు. ఆ నిర్మానుష్య ప్రాంతం నుంచి ఆ యువతి వారి స్నేహితుల వద్దకు చేరుకొని, అసలు విషయాన్ని చెప్పింది. దీంతో వారు ఓ ఆటు డ్రైవర్ సాయంతో మీర్ పేట స్టేషన్ కి వెళ్లారు. ఇది తమ పరిధిలోకి రాదని, పహాడీ షరీఫ్ పీఎస్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో వారు వెంటనే అక్కడ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే యువతి చెప్పిన వివరాలను కూడా నమోదు చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు అస్లాంను అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత జర్మనీ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లి, వైద్య పరీక్షలు చేయించారు పోలీసులు. అనంతరం బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు.
జర్మనీ దేశస్థులు ఇక్కడికి ఎలా వచ్చారంటే…
హైదరాబాద్ కి చెందిన శరత్ చంద్ర చౌదరి అనే యువకుడు ఇటలీలోని యూనివర్శిటీలో డిగ్రీ చదువుతున్నాడు. అక్కడే జర్మనీకి చెందిన యువతి, యువకుడు మ్యాక్సిమిలియన్ పరిచయమయ్యారు. మంచి స్నేహితులు కూడా అయ్యారు. అప్పుడు భారత్ లో వున్న పర్యాటక ప్రాంతాలను చూడడానికి శరత్ ఆహ్వానించాడు. మార్చి 4 న యువతి, యువకుడు మ్యాక్సిమిలియన్ భారత్ కి వచ్చారు. మీర్ పేటలోని శరత్ ఇంట్లోనే వున్నారు. హైదరాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను చూశారు.
ఏప్రిల్ 3 న తిరిగి జర్మనీకి వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే.. శరత్ వరంగల్ లో వున్న తన బంధువుల ఇంటికి కుటుంబీకులతో కలిసి వెళ్లాడు. జర్మనీ స్నేహితులు మాత్రం ఆ ఇంట్లోనే వున్నారు. అయితే కూరగాయల కోసం మంద మల్లమ్మ చౌరస్తా దగ్గర వున్న మార్కెట్ కి వెళ్లారు. అప్పుడే యాకుత్ పురా కి చెందిన డ్రైవర్ మహ్మద్ అబ్దుల్ ఇస్లాం ఐదుగురు మైనర్ స్నేహితులతో కలిసి కారులో వచ్చాడు. వీరిని పరిచయం చేసుకున్నారు. కొత్త ప్రాంతాలు చూపిస్తానని నమ్మబలికి, అత్యాచారానికి దిగాడు.