News

మధ్యప్రదేశ్ లోని పుణ్య క్షేత్ర నగరాలలో మద్య నిషేధం అమలు

350views

మధ్యప్రదేశ్ లో ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల లోని 19 పుణ్య క్షేత్ర నగరాలలో ఏప్రిల్ 1 నుంచి మద్య నిషేధం అమలులోకి వచ్చింది. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, మాహర్, మండలేశ్వర్, ఓర్చా, చిత్రకూట్, దతియా, పన్నా, మండ్లా, ముల్తాయ్, మండ్ సౌర్, అమర్ కంఠక్ ల పట్టణ పరిధిలో అన్ని మద్యం దుకాణాలు, బార్లను మూసేస్తున్నట్లు
ప్రభుత్వ అధికారి ఒకరు ధృవీకరించారు.సల్కన్‌పూర్, కుండల్‌పూర్, బందక్‌పూర్, బర్మంకలన్, బర్మంఖుర్డ్ మరియు కొన్ని ఇతర గ్రామ పంచాయతీ పరిధిలో కూడా ఈ నిషేధం అమలులోకి వస్తుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించిన ఈ నిర్ణయానికి జనవరి 24వ తేదిన మహేశ్వర్ లో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు

బిజెపి ప్రభుత్వం ఈ 19 పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా పవిత్ర ప్రాంతాలుగా ప్రకటించింది, వాటి పరిధిలో పూర్తిగా మద్య నిషేధాన్ని విధించింది. ఈ ఏడాది జనవరి 24న మహేశ్వర్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆయా ప్రాంతాల మతపరమైన ప్రాముఖ్యతను దృష్ట్యా ఆ ప్రదేశాల పవిత్రతను కాపాడటానికి మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలలో మద్యపానాన్ని కట్టడి చేసేందుకు ఇది ఒక చారిత్రాత్మక అడుగుగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అభివర్ణించారు.