News

ఏప్రిల్‌ 8న సప్త జ్యోతిర్లింగ దర్శన్‌ ప్రత్యేక రైలు

452views

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 8న విజయవాడ నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శన్‌ యాత్ర ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు సంస్థ విజయవాడ ఏరియా మేనేజర్‌ ఎం.రాజా తెలిపారు. ఆయన ఇక్కడ దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, ఈ యాత్రలో ఉజ్జయినీ(మహాకాళేశ్వర్‌, ఓంకారేశ్వర్‌), ద్వారక (నాగేశ్వర్‌), సోమనాథ్‌, పుణే(భీమశంకర్‌), నాసిక్‌ (త్రయంబకేశ్వర్‌), ఔరంగాబాద్‌ (గ్రిష్ణేశ్వర్‌) సందర్శన ఉంటుందని వివరించారు. ఈ రైలు విజయవాడలో బయలుదేరి ఖమ్మం, కాజీపేట, హైదరాబాద్‌ మీదుగా ప్రయాణిస్తుందన్నారు. ఏప్రిల్‌ 8న బయలుదేరే ఈ రైలు 19న తిరిగి విజయవాడ చేరుతుందని చెప్పారు. ఈ రైలులో ఎకానమీ(స్లీపర్‌), స్టాండర్డ్‌ (3ఏసీ), కంఫర్ట్‌ (2ఏసీ) సౌకర్యాలు ఉంటాయన్నారు. వివరాలకు 92814 95848, 92810 30714 నంబర్లలో సంప్రదించాలన్నారు.