
415views
జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించిన కళాకృతులు, చారిత్రక డాక్యుమెంట్లను దిల్లీలోని గాంధీ జాతీయ మ్యూజియానికి దక్షిణాఫ్రికాకు చెందిన ఫీనిక్స్ సెటిల్‌మెంట్ ట్రస్టు- గాంధీ డెవలప్‌మెంట్ ట్రస్టు (పీఎస్‌టీ-జీడీటీ) అప్పగించింది. వాటిలో గాంధీ స్వయంగా నేసిన వస్త్రాలు, ఇతర కళాకృతులు, దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌లో ఆయన నివాసమున్న ప్రాంతానికి సంబంధించిన చారిత్రక డాక్యుమెంట్లు ఉన్నాయి.
‘మహాత్మా గాంధీకి సంబంధించిన కళాకృతులను, చారిత్రక డాక్యుమెంట్లను అప్పగించే కార్యక్రమంలో నేను పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. బాపు జీవితం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది’ అని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జైశంకర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.





