News

హిందువుల ఐక్యతకు ఇబ్బందులు కలిగించేలా దాడులు

370views

రాష్ట్రంలో హిందువుల ఐక్యతకు ఇబ్బందులు కలిగించే ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయని విశ్వ హిందూ పరిషత్- వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డిసాయిరెడ్డి ఆరోపించారు.కర్నూలు నగరంలోని వెంకటాచలపతి కల్యాణ మండంలో శ్రీరామాలయం పేట స్వాగత సభ్యులు, పుర ప్రముఖులు, ధార్మిక సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి ఆలయం ప్రధాన అర్చకుడు, సమితి కార్యదర్శి మాళిగి హనుమేషాచార్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరంలోని 200 సంవత్సరాల చరిత్ర కలిగిన వన్‌టౌన్‌ ఏరియాలోని శ్రీ రామాలయం బ్రహ్మోత్సవాలు ప్రారంభించి 99 సంవత్సరాలైందని తెలిపారు. శతాబ్ది ఉêత్సవాలు ఏప్రిల్‌ 12 నుంచి 18 వరకు జరుగుతాయని వెల్లడించారు.