News

ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు ఉగ్ర ముప్పు

963views

ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్రనేతలపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం, నేతలపై ఉగ్రవాదులు గురిపెట్టినట్లు నిఘావర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదులు.. ఇప్పటికే పీవోకే ద్వారా చొరబడినట్లు సమాచారం.

తాజా ఘటనల నేపథ్యంలో దిల్లీ స్పెషల్‌ సెల్‌ను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. కేంద్ర నిఘా సంస్థ హెచ్చరికలతో దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్లీ ఎన్‌సీఆర్‌, ఎన్‌ఐఏ కార్యాలయం, సీజీవో కాంప్లెక్స్‌, ఎన్‌ఎస్‌జీ, సీఆర్‌పీఎఫ్‌ కార్యాలయాలపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు నిఘావర్గాలు తెలిపాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని ఆయా విభాగాలను కేంద్ర హోంశాఖ హెచ్చరించింది.

Source : Enadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.