ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం కలుగుతుందని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ అన్నారు. విశ్వంజీ జన్మదిన వేడుకల్లో భాగంగా బాపట్ల జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని చినకోండ్రుపాడు విశ్వనగర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య విశ్వంజీ ఔదంబర వృక్ష పీఠ సుస్థాపిత దత్త గురువులకు విశేష అర్చన చేశారు. అనంతరం యాగశాలలో వేద పండితులు శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్ట, మహాగణపతి హవనం, సుదర్శన నారసింహ, శ్రీ మహారుద్ర హవనములు, స్థాపిత దేవతా పంచోపచార పూజ, నీరాజన, మహామంత్రపుష్ప చతుర్వేద సేవలను చేశారు. తొలుత శాంతిపాఠం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యమేళన ప్రాశనం, రక్షాబంధనం, ఆచార్యాది ఋత్విక్ వరణం, వాస్తు, నవగ్రహ, యోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్ర, సుదర్శన నారసింహ, మహామృత్యుంజయ సప్త చిరంజీవి ఆవాహనం, అఖండధీప స్థాపన కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. విశ్వమానవ సమైక్యతా సంసత్ కన్వీనర్ ఆకుల కోటేశ్వరరావు, కామేశ్వరి దంపతులతో విశ్వంజీ ప్రత్యేక పూజలు చేయించారు. రాత్రి ఆడిటోరియంలో విశ్వణి కూచిపూడి నాట్య ప్రదర్శన, లోల మనస్వి, నిధిమల భరతనాట్య ప్రదర్శన, కౌటూరి గాయత్రి సంగీత విభావరి, ఫణికుమార్ వేణుగాన కచేరీలు అలరించాయి.
360views
You Might Also Like
భారత్ విడిచి వెళ్లిపోండి… అమెరికా పౌరులకు అల్టిమేటం
44
అమెరికాకి చెందిన ముగ్గురు జాతీయులపై పూణె పోలీసులు చర్యలు తీసుకున్నారు. అక్రమంగా మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొంటూ, అలాగే పర్యాటక వీసాల నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ...
ధర్మాన్ని అనుసరిస్తే దైవానుగ్రహం
34
చిన్నతనం నుంచే పిల్లలను ధర్మపాలన వైపు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్మాత్మిక సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచించారు. పార్వతీపురంలో శ్రీకల్యాణ వేంకటేశ్వర ఆలయ శతాబ్ది ప్రయోక్త నవాహ్నిక...
భారత్ ఆత్మ ‘‘సర్వజన హితాయ, సుఖాయ : భయ్యాజీ జోషి
50
సర్వజన హితాయ సర్వజన సుఖాయ అన్నదే భారత దేశ ఆత్మ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్య కారిణి సదస్యులు భయ్యాజీ జోషి అన్నారు.భారతీయ...
ఘనంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ..
52
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో వైశాఖ పౌర్ణమి సందర్బంగా విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం ఘాట్ రోడ్డు మొదట్లో ఉన్న...
సర్వకాలికం, సార్వజనీనం బుద్ధుడు ప్రబోధాలు
( బుద్ధ పూర్ణిమ ) మానవ అస్తిత్వం, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన విశిష్ట స్పృహతో ఉన్న కొంతమంది వ్యక్తులు చరిత్రలోని విభిన్న మలుపుల్లో మొత్తం మానవాళికి సంబంధిత...
సింహాద్రినాథుడికి చందన సమర్పణ
58
వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామికి శుక్రవారం రెండవ విడత చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇప్పటికే సిబ్బంది మూడు మణుగుల గంధాన్ని (సుమారు...





