ArticlesNews

మాదక ద్రవ్యాల వ్యాపారంలో అత్యధికులు ముస్లింలే.. షాకింగ్ రిపోర్ట్

203views

తమిళనాడులోని రామనాథ పురానికి సంబంధించి అత్యంత కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. మాదక ద్రవ్యాల వ్యాపారంలో ఎక్కువగా ముస్లిం సామాజిక వర్గమే వున్నట్లు డేటా వెల్లడిస్తోంది. పోలీసుల పరిశీలనలో కూడా ఇదే తేలింది.మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వ్యవస్థీకృత నేరాల నెట్ వర్క్ పెరిగిపోవడంతో ఆందోళన కలిగిస్తున్నాయి.

ముఖ్యంగా మాదక ద్రవ్యాల వ్యాపారంలో ముస్లిం యువకుల ప్రమేయమే ఎక్కువగా వుందని వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు.అటు పరిశీలనలు చెబుతున్నా… పోలీసుల నివేదికలు ముస్లింల ప్రమేయాన్ని వెల్లడిస్తున్నా… స్థానికంగా వుండే మౌల్వీలు మాత్రం మరో రకమైన వాదనను వినిపిస్తున్నారు.

ముస్లిం యువతను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని, పెద్దల పాత్రపై మాత్రం మౌనం వహిస్తున్నారని అర్థం పర్థంలేని ఆరోపణలకు దిగుతున్నారు. ముస్లిం యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, వారు మానసిక రుగ్మతలకు గురయ్యేలా చేస్తున్నారని అంటున్నారు. ముస్లింల ప్రమేయాన్ని అంగీకరించకుండా, వారే బాధితులు అన్న కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

రామనాథపురం జిల్లాలోని పలు ప్రాంతాలు ముఖ్యంగా మెథాంఫైటమైన్, గంజాయి, తదితర మాదక ద్రవ్యాల రవాణాకు కీలక కేంద్రంగా మారిపోయాయి. కొన్ని నెలలుగా అధికారులు కీళ్‌కరాయ్, దేవిపట్టిణం, కొన్నికరై, తొండి వంటి ప్రాంతాలలో అనేక మందిని అరెస్ట్ కూడా చేశారు.

ఇండియన్ కోస్ట్ గార్డ్, స్థానిక పోలీసుల సమన్వయంతో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను చాలా సార్లు అడ్డుకున్నారు. ముఖ్యంగా పడవల మాధ్యమంగా ఈ అక్రమ రవాణాను చేస్తున్నారని కూడా తేలింది. అయితే.. ఈ ఆపరేషన్లలో మెథాం ఫైటమైన్ తో పాటు నగదు, మొబైల్స్ తో సహా పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్టోబర్ 24, 2024న, రామనాథపురం జిల్లా తొండికి చెందిన ఆసిక్ (20), సాహుల్ హమీద్ (20), మరియు బుర్హాన్ అలీ (22) అనే ముగ్గురు ముస్లిం యువకులను ఇదే కేసులో అరెస్టు చేశారు.

అక్టోబర్ 25న, కార్పొరేషన్ డంప్ యార్డ్ సమీపంలో మెథాంఫెటమైన్ అమ్మినందుకు కొన్నికరై పోలీసులు మహమ్మద్ హరిస్ (30) ను అరెస్ట్ చేశారు.

నవంబర్ 25న, సక్కరైకోట్టైలోని అబ్దుల్ కలాం నగర్‌లోని ఒక మద్యం దుకాణం సమీపంలో మెథాంఫెటమైన్ అమ్మినందుకు రామనాథపురం పట్టణానికి చెందిన హబీబ్ మహ్మద్ (19) మరియు హమీద్ మహ్మద్ (20) అనే ఇద్దరు ముస్లిం యువకులను కొన్నికరై పోలీసులు అరెస్టు చేశారు.

డిసెంబర్ 4న, కీజకరైలోని పెరియ కడు ఊతపన్నై బీచ్ సమీపంలో మెథాంఫేటమైన్ మరియు గంజాయి విక్రయించడానికి ప్రయత్నించినందుకు కీజకరై పోలీసులు అఖిల్ అలీ (27), మహమ్మద్ నబిల్ (23) అరెస్ట్ అయ్యారు.

డిసెంబర్ 9 న మాదక ద్రవ్యాల రవాణా కేసులో జైనులాబదిన్, సయ్యద్ మహ్మద్, సదం హుస్సేన్ అనే యువకులు అరెస్ట్ అయ్యారు.

మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కింగ్ జాఫర్ సాదిక్,తమిళనాడు టెక్స్ట్ బుక్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ మధ్య ఉన్న సంబంధంపై రాష్ట్ర పాఠశాల విద్యా మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోళి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.2023-24లో జామెట్రీ బాక్సులను సరఫరా చేసినందుకు అప్పు డైరెక్టర్ కి TNTAESC టెండర్ ఇచ్చిందని, ఆ సమయంలో DMK NRI వింగ్ కార్యకర్త సాదిక్ రాష్ట్ర పాఠ్యపుస్తక కార్పొరేషన్‌ను మనీలాండరింగ్ కోసం ఉపయోగించుకున్నారని అన్నామలై ఆరోపిస్తున్నారు.