News

‘‘ఓం’’ గుర్తుపై యాసిడ్ పోసి, హిందూ బాలికపై గ్యాంగ్ రేప్

422views

యూపీలోని మొరాదాబాద్ లో ముస్లిం ఛాందసుల రాక్షసత్వం బయటపడింది. 14 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేశారు ముస్లింలు. సల్మాన్, ఆరిఫ్, జూబైర్ తో పాటు రషీద్ అనే ముస్లిం యువకులు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.ఈ నలుగురూ దళిత బాలికను కిడ్నాప్ చేసి, రెండు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సమయంలో ఆ బాలిక చేతిపై ఓం అని రాసి వుంది. దీంతో వారు మరింత రెచ్చిపోయి, అక్కడ యాసిడ్ పోసి, ఓంను చెరిపేశారు. అంతేకాకుండా ఆమెతో బలవంతంగా గొడ్డు మాంసం తినిపించారు. అయితే జనవరి 2 వ తేదీన ఈ బాలిక టైలర్ దగ్గరికి వెళ్తున్న సమయంలో ముస్లింలు కిడ్నాప్ చేసినట్లు కుటుంబీకులు చెబుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆందోళనకు దిగారు. నిందితులకు వెంటనే కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ విషయంపై బాధితురాలి కుటుంబీకులు భగత్ పూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులపై137(2), 70(1), 123, 127(4), 299, 351(3), 124(1), పోక్సో, SC/ST చట్టంలోని సెక్షన్లు 5, 6 కింద కేసులు పెట్టారు. మరోవైపు ప్రధాన నిందితుడు సల్మాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతరుల కోసం గాలిస్తున్నారు.