News

జులై 3 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం

332views

దక్షిణ కశ్మీర్‌లో 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఏటా వైభవంగా నిర్వహించే పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర తేదీలు ఖరారయ్యాయి. జులై 3 నుంచి యాత్ర ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో శ్రీ అమర్‌నాథ్‌ ఆలయ బోర్డు (ఎస్‌ఏఎస్‌బీ) జరిపిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ‘‘అనంతనాగ్‌ జిల్లాలోని పహల్‌గామ్‌ మార్గం, గాందర్‌బల్‌ జిల్లాలోని బాల్టాల్‌ మార్గాల నుంచి ఒకేసారి జులై 3న అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమవుతుంది. 38 రోజుల తర్వాత ఆగస్టు 9న యాత్ర ముగుస్తుంది’’ అని ప్రతినిధి తెలిపారు.