
ప్రతి ఏడాది లాగానే 2020 ఫిబ్రవరి 1,2 తారీఖులలో మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర శిక్షణా తరగతులు గుంటూరులో జరగనున్నాయని మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కదిరి పోలరాజు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కర్రి పద్మశ్రీలు కాకినాడలో ఒక ప్రకటనలో తెలిపారు.
గత 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని మత్స్యకార గ్రామాలలో విద్య, వైద్యం, క్రీడలు, భక్తి, గ్రంధాలయం, మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి తదితర అంశాల సాధన కోసం మత్స్యకార సంక్షేమ సమితి కార్యకర్తలు విశేషంగా కృషి చేస్తున్నారని, అందుకోసం ప్రతి ఏడాది రెండు రోజులపాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని, ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా రెండు రోజులపాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నామని వారు తెలిపారు.

2020 ఫిబ్రవరి 1, 2 తేదీలలో జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో కేరళకు చెందిన అఖిలభారత సీమా సురక్ష ప్రముఖ్ శ్రీ గోపాలకృష్ణన్, ఆర్ఎస్ఎస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార కమీషనర్, నెల్లూరు జిల్లా ముత్తుకూరు లోని మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ హరిబాబు తదితరులు పాల్గొని మార్గదర్శనం చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని కూడా వారు విడుదల చేశారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





