
291views
కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.57,566.01 కోట్లు, తెలంగాణకు రూ.29,899.77 కోట్ల వాటా రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. రెండు రాష్ట్రాలకూ ఇది 2024-25లో వచ్చిన దానికంటే 10.53% అధికం.





