
57views
విశాఖపట్నంలోని ఏయూ ఇంజ నీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 24,25,26 తేదీల్లో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ, స్వాగత సమితి ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 25న ఏబీవీపీ కార్యకర్తలతో శోభాయాత్ర జరుగుతుందన్నారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాచంద్ర మాట్లాడుతూ సంస్థ ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా త్వరలో ‘పంచ పరివర్తన్’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.