News

యథావిధిగా సర్వదర్శనం టోకెన్లు..

50views

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గతంలో తరహాలోనే ఈ నెల 23 నుంచి గురువారం ఏ రోజుకారోజు సర్వదర్శనం టోకెన్లను అందించనున్నట్లు తెలిపింది. టోకెన్లను అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో భక్తులు పొందవచ్చని తెలిపింది.

ఇదిలా ఉండగా.. ఈ నెల 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించిన విషయం తెలిసిందే. టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలు కల్పించింది. వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసిన నేపథ్యంలో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. భక్తుల రద్దీ తగ్గే వరకు సర్వదర్శనం భక్తులను నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోకి అనుమతించి దర్శనాలు కల్పిస్తున్నది. ఇక ఈ నెల 23 నుంచి (గురువారం ) ఏ రోజుకారోజు సర్వదర్శనం టోకెన్ల జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.