
కేంద్ర ప్రభుత్వం యొక్క “కార్పొరేట్ సామాజిక బాధ్యత” నినాదాన్నందుకుని పలు కార్పొరేట్ సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి మేలు చేసేవిగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సింహాచలం దేవస్థానం వారికి నూతనంగా ఒక బస్ కొనుగోలు చేయుటకు గాను 20.63 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. దీంతో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కల్పించి నట్లైంది. గురువారం సింహాచలం కొండపైన జరిగిన కార్యక్రమంలోSBI మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ B. రమేష్ బాబు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ M.వెంకటేశ్వరరావు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో SBI జనరల్ మేనేజర్ శ్రీ BVSKT భాస్కర్, రీజినల్ మేనేజర్ శ్రీ YVSS నాగేశ్వరరావు, సింహాచలం మానేజర్ శ్రీ K. సౌమిత్రి, శ్రీ V.సత్యనారాయణ ఆలయ సిబ్బంది మరియు అర్చకులు పాల్గొన్నారు.
Source : Enadu.





