News

ఒంటిమిట్టలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు

185views

అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట ఈనెల 10వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో తిరుమల–తిరుపతి దేవస్థానం వారు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిపిచేందుకు దాతల సహాయంతో నిర్వాహకులైన పోతున సాహితీ పీఠం కార్యదర్శి ముమ్మడి నారాయణ రెడ్డి, పసుపులేటి సుబ్బరాయుడు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి వేడుకలను దాతల సహాయంతో నిర్వహిస్తామని,, ఈ ఏడాది కూడా తామే జరపనున్నట్లు చెప్పారు. ఈ సంవత్సరం మేడా విజయ శేఖర్‌ రెడ్డి, ఆయన సతీమణి స్మిత పూల అలంకరణకోసం రూ. 2 లక్షలు విరాళంగా ఇచ్చారన్నారు.వైకుంఠ ఏకాదశి వేడుకలను వీక్షించేందుకు లక్షలాదిగా భక్తులు విచ్చేసి స్వామి కృపను పొందాలని వారు కోరారు.