హైందవ శంఖారావం సభలో ఎస్సీ నాయకులు గరికముక్కు సుబ్బయ్య ప్రసంగం:
ఈ దేశంలో ఎస్సీ కులాల వారు కూడా హిందువులే. కులం మన వ్యక్తిగతం. ధర్మం మన స్వయం, మనం ధర్మ రక్షకులం.
సమరసతా సేవా ఫౌండేషన్ ద్వారా ఎందరో ఎస్సీ ఎస్టీలకు అర్చక శిక్షణ ఇప్పించి ఆలయాల్లో నియమింపజేసాం.
రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. అస్పృశ్యత అంటరానితనానికి గురైన కొన్ని కులాలకు, హిందూ ధర్మాన్ని ఆచరించే సనాతన ధర్మ ఆచరణ చేసేవారికి మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు.
హిందూ ధర్మాన్ని ఆచరించే అంటరానితనాన్ని అనుభవిస్తున్నవారికే రిజర్వేషన్లు అని రాజ్యాంగంలో స్పష్టం చేసారు.
అన్యమతస్తులకు రిజర్వేషన్లు లేవు అని స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పారు. ఇవాళ అన్యమతాల్లోకి మారిపోయి రిజర్వేషన్లు వాడుకుంటున్నారు. అది రాజ్యాంగ వ్యతిరేకం.
రిజర్వేషన్ సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారు. ప్రభుత్వాధికారులు, రాజకీయ నేతలూ గమనించాలి. మతం మారిన వారికే రిజర్వేషన్లు ఇస్తున్నారు.. అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం.
మతం మారిన వారికి రిజర్వేషన్లు ఇవ్వకూడదు.
అన్ని కులాల్లో ఉన్నవారూ హిందువులే. మతం మారినవారందరూ వెనక్కి రావాలి.
రాజ్యాంగ సభలో చర్చ జరిగే సందర్భంలో క్రైస్తవులు ఒకటి చెప్పారు… మా మతంలో కులం లేదు, అంటరానితనం లేదు.. అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు పాటిస్తున్నారు?
హిందూ ధర్మంలో ఉండండి… లేకుండా మరో మతంలోకి వెడితే రిజర్వేషన్లు వాడుకునే హక్కు మీకు లేదు. అది అంబేద్కర్ స్పష్టంగా చెప్పారు.
ఎండోమెంట్ గుడుల్లో హిందువులైన ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ప్రాధాన్యం కల్పించండి.
అన్యమతస్తులకు అవకాశం ఇవ్వవద్దు. అన్ని గుడుల్లో అర్చకులుగా ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించాలి.
మేమంతా హిందువులు, సనాతన ధర్మవాదులం, భారత్ మాతా కీ జై.
బహు భారత్వం నిషేధం విషయంలో అసోం ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా, రెండో పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు షాక్...
లష్కరే తోయబా (LeT) ఉగ్రవాది, పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నాయకుడు ఇమ్రాన్ లియాకత్ భట్టి భారత్కు వ్యతిరేకంగా తీవ్ర బెదిరింపులకు దిగాడు. దీనికి సంబంధించిన...
మలయాళ నూతన సంవత్సరం, పవిత్ర చింగం మాసం ప్రారంభం సందర్భంగా శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. నెలవారీ పూజల్లో భాగంగా...
సేవాఘఢ్: బంజారా, గిరిజన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సేవాఘఢ్ నుంచి ఢిల్లీ వరకు భారత్ గోర్ బంజారా జోడో యాత్ర...
చరక జయంతి వేడుకల్లో ధన్వంతరి హవనం.. 400 మందికి పైగా ఆయుర్వేద చికిత్సలు అనకాపల్లి జిల్లా కొడూరు గ్రామంలోని ఆరోగ్యధాత్రి ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో విశ్వ ఆయుర్వేద...