NewsProgramms

హైందవ శంఖారావం సభలో కమలానంద భారతీ స్వామీజీ ప్రసంగం:

448views

హైందవ శంఖారావం సభలో
కమలానంద భారతీ స్వామీజీ ప్రసంగం:

  • దేవదాయ శాఖని రద్దు చేయాలన్నది మన ప్రధాన ఆశయం. మన దేవాలయాలను రాజులు, జమీందార్లు, భక్తులు కట్టించారు.
  • కానీ వాటితో సంబంధం లేని ప్రభుత్వాలు – సినిమా హాళ్ళలో టికెట్లు అమ్ముకుంటున్నట్లు దర్శనం టికెట్లు, ప్రసాదం టికెట్లు అమ్ముకుంటున్నారు. వాళ్ళకు గుడులతో ఏం సంబంధం.
  • నెల రోజుల క్రితమే విశ్వహిందూ పరిషత్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రికి ఇచ్చిన పత్రమే ప్రజలకూ ఇచ్చింది. ఆ రోజు నుంచే హిందూ బంధువులు ఈ కార్యక్రమానికి వెళ్ళడానికి సంసిద్ధులయ్యారు.
  • ఆ చట్టం పేరే హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం. గుడుల్లో బోర్డుల మీద అదే పేరు ఉండేది. ఇప్పుడు దేవాలయాల మీద హిందూ శబ్దం తీసేసారు. హిందువుల్లో జాగృతంగా లేనందునే అలా జరిగింది.
  • గుడులపై దాడులు, హుండీల దోపిడీ, ఆభరణాలు, ఆస్తుల దోపిడీ… అన్నింటికీ కారణం హిందువుల్లో జాగృతి లేకపోవడం.
  • 2006-07 సంవత్సరంలో షామీర్‌పేట మండలంలో ఒక రామాలయంలో భూముల అన్యాక్రాంతం గురించి గొడవ జరిగితే ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. ఇప్పటివరకూ ఆ కమిషన్ నివేదిక వెలుగు చూడలేదు.
  • దేవాలయ ఆస్తులను ప్రభుత్వాలు సైతం కబ్జా చేసి తమ కార్యాలయాలు కట్టేసుకుంటున్నాయి. భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాయి. గుడిలో దైవాల విగ్రహాల కంటె హుండీలే ఎక్కువ పెట్టారు. భక్తులందరినీ డబ్బులు వేసేలా ప్రోత్సహిస్తున్నాయి.
  • కర్ణాటకలో మూడేళ్ళ క్రితం దేవదాయ శాఖ తొలగించి, హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించే చట్టం దాదాపు తయారైంది. అంతలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ చట్టం అటకెక్కింది.
  • మన సంప్రదాయాలను మనం గౌరవించుకోవాలి.
    మత్స్యావతార దేవాలయం, నాగలాపురం ఆంధ్రప్రదేశ్ ; కూర్మావతార దేవాలయం శ్రీకూర్మం, ఆంధ్రప్రదేశ్ ; వరాహావతార దేవాలయం, తిరుమల, ఆంధ్రప్రదేశ్ ; నరసింహావతార దేవాలయం, మహానంది ఆంధ్రప్రదేశ్ ;
    వామనావతార దేవాలయం, ప్రకాశం జిల్లా, పరుచూరు మండలం చెరుకూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.
  • శ్రీకాకుళం జిల్లాలో పరశురామావతార దేవాలయం మహేంద్రపర్వతం, రామావతారం ఉత్తరప్రదేశ్,
    కృష్ణావతారం ఉత్తరప్రదేశ్,కలియుగ వైకుంఠం వేంకటేశ్వరస్వామి అవతారం తిరుమల, ఆంధ్రప్రదేశ్.
  • కాబట్టి… ఆంధ్రప్రదేశ్‌ను దేవభూమిగా ప్రకటించాలి. దేవాలయ క్షేత్రాలను అభివృద్ధి చేయాలి.
  • జైశ్రీరాం… వందేమాతరం… భారత్ మాతా కీ జై.