
రళలోని శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. అయితే అయ్యప్ప భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు శబరిమల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. చాలా కాలంగా చిక్కుముడిలో ఉన్న ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు వేగంగా అమలు చేస్తున్నారు.
శబరిమల గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించిన సామాజిక ప్రభావ అధ్యయన నివేదిక వెలువడింది. కొట్టాయం జిల్లా యంత్రాంగం ప్రచురించిన నివేదిక ప్రకారం.. కొట్టాయం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు, అయ్యప్ప యాత్రికులకు సేవలందించేందుకు విమానాశ్రయం నిర్మాణం కోసం 3.4 లక్షల చెట్లను నరికి, 352 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. 3.3 లక్షల రబ్బరు, 2492 టేకు, 1131 పనస చెట్లు, 828 మహోగని, 184 మామిడి చెట్లను నరికివేయాలి. అంతే కాదు దేవాలయాలు, మసీదులను కూడా మార్చాలని సూచించారు. సెయింట్ థామస్ ఎక్యుమెనికల్ చర్చి, హిదాయుతుల్ ఇస్లాం జుమా మసీదు, శ్రీ అమ్మన్ కోవిల్, శ్రీ పూవన్‌పలమల దేవాలయం, సెయింట్ గ్రెగోరియో చర్చి, సెయింట్ జోసెఫ్ చర్చి కరీమ్‌హోట్, పంచతీర్థ పరాశక్తి దేవస్థానాలను కూడా తరలించాల్సి ఉంటుందని.. ఈ ప్రాంతంలోని ఒక పాఠశాల, 5 వ్యాపారాల సంస్థలను మార్చవలసి ఉంటుందని తెలుస్తోంది.





