News

వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు

338views

వైకుంఠ ద్వార దర్శన సర్వదర్శనం టికెట్ కౌంటర్లలో జరుగుతున్న ఏర్పాట్లను తిరుపతిలో టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు పరిశీలించారు. జనవరి 10నుంచి 19వతేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచనుంది టిటిడి.తిరుపతిలో 9వతేదీ ఉదయం 5.30గంటలకు కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేయనుంది టిటిడి.నగరంలోని 8కేంద్రాల్లోను, తిరుమలలో ఒక కేంద్రంలో మొత్తం 91కౌంటర్లలో టోకెన్లను జారీ చేయనుంది టిటిడి. భక్తుల మధ్య తోపులాటలు లేకుండా టోకెన్లను జారీ చేయాలని టిటిడి సిబ్బందిని టిటిడి ఛైర్మన్ఆదేశించారు. అనంతరం టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి టోకెన్లను జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని..ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నానన్నారు. టిటిడి ఇఓ శ్యామలారావుతో ఏర్పాట్లపై చర్చించానని చెప్పిన టిటిడి ఛైర్మన్..శ్రీవారి భక్తులకు ఒక విజ్ఞప్తి చేశారు. జనవరి 10నుంచి 19వతేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచేఉంటాయని.. 10,11,12వతేదీల్లోనే స్వామివారిని దర్శించుకోవాలని అనుకోకుండా..టోకెన్లను తీసుకోవాలన్న ఆతృతలో తోసుకోవదన్నారు. 19వతేదీ వరకు ఎప్పుడైనా స్వామివారిని దర్సించుకోవచ్చునని..సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. విఐపిలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.